NTV Telugu Site icon

Ganesh Nimajjanam 2022: వారికి శుభవార్త.. వీరికి మాత్రం బ్యాడ్‌ న్యూస్‌..

Ganesh Nimajjanam

Ganesh Nimajjanam

హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా రేపు గణేష్‌ నిమజ్జనం సాగనుంది.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు భక్తులు.. అయితే, హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… మహా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా గణపయ్యకు బైబై చెప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు.. అయితే, ఈ సందర్భంగా అందరికీ శుభవార్త వినిపించిన ప్రభుత్వం.. మందు బాబులకు మాత్రం బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది… వినాయక నిమజ్జనం సందర్భంగా… శుక్రవారం రోజు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది సర్కార్‌… అయితే, శుక్రవారానికి బదులుగా నవంబర్ 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Read Also: 4 Year old Saves Mother’s Life: నాలుగేళ్ల బుడతడు.. తల్లి ప్రాణాలు నిలిపాడు..

ఇక, బ్యాడ్‌ న్యూస్‌ విషయానికి వస్తే.. హైదరాబాద్‌ సిటీఓ గణేష్‌ నిమజ్జనం సందర్భంగా.. రెండు రోజుల పాటు.. శుక్రవారం, శనివారం (సెప్టెంబర్9, 10 తేదీల్లో) మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.. అయితే, శనివారం సాయంత్రం తిరిగి తెరుచుకోనున్నాయి మద్యం షాపులు.. వినాయక నిమజ్జనం నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్.. జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.. ఈ సమయంలో.. కల్లు దుకాణాలు, వైన్స్, బార్, లిక్కర్‌కు సంబంధించిన అన్ని షాపులు మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు.