NTV Telugu Site icon

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది.. గోవా సీఎం

Pramod

Pramod

తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతున్నారు. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకులను కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రానున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. గోవాలో మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని… 100 శాతం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా గోవా ఉందని ఆయన అన్నారు. గోవాలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాలి… వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోవా లో వితంతు పెన్షన్ ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి మా దగ్గర కూడా ఉంది… లక్ష రూపాయలు మేము ఇస్తున్నామని ఎద్దేవ చేశారు. తులకు, పాడి రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అని అన్నారు.మోడీ పథకాలు కొన్ని ఇక్కడ ప్రజలకు అందడం లేదని మండిపడ్డారు. ఈరాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు లాభం చేకూర్చడం ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పథకాలు తెలంగాణాలో అమలు కావాలి అంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలని, ప్రజలకు అర్థం అయిందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.

Thailand: భక్తులతో మలం తినిపిస్తున్న దొంగ బాబా అరెస్ట్