Jagadish Reddy: ‘ఖమ్మం-నల్గొండ-వరంగల్’ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 457లో ఆయన తొలి ఓటు వేశారు. ఈ పోలింగ్ బూత్‌లో 673 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్ ప్రారంభానికి ముందు బూత్‌కు వచ్చిన జగదీశ్‌రెడ్డి తొలి ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లను లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన మరుసటి రోజు జూన్ 5న లెక్కించనున్నారు. కాగా.. ములుగులో మంత్రి సీతక్క, వరంగల్ లో మంత్రి కొండా సురేఖ, హనుమకొండ తేజస్వి స్కూల్ పోలింగ్ కేంద్రంలో MLA నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండలోని పింగిలి మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, హనుమకొండ ప్రశాంత్ నగర్ లో MLA కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read also: Today Gold Price: బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!
మరోవైపు తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ అందరూ కూడా దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నాతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులకు నా కృతజ్ఞతలు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న నాకు ఎలక్షన్ కమిషన్ నాకు ఓటు హక్కు కల్పించిందన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళు పల్లి బాఠని గాళ్లా.. 5వ తేదీన పల్లిబాఠని గాళ్ళు ఎవరో తెలుస్తోందన్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ వాతావరణ నెలకొంది. పోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. 200 మీటర్ దూరంలో ఉన్నాం.. మీకు ఇబ్బంది ఏంటని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
Gaming zone cctv footage : గేమింగ్ జోన్ నుండి సీసీటీవీ ఫుటేజ్.. మంటలు ఎలా స్టార్టయ్యాయో చూడండి