Telangana Elections 2023: తెలంగాణ లోని పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వివరాలలోకి వెళ్తే.. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దయాకర్ రావు మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని హర్షం వ్యక్తం చేసారు. కాగా కేసీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బి అర్ ఎస్ పార్టీ లో చేరనున్నారు.
Read also:Martin Luther King Review: మార్టిన్ లూథర్ కింగ్ రివ్యూ
అలానే వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లోనూ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా లోని బట్టుపట్టి దగ్గర వర్ధన్నపెట్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. కాగా ముఖ్య మంత్రి సభ ఏర్పాట్లను ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో బట్టుపల్లి బైపాస్ రోడ్డు నుండి భారీ వాహనాల రాకపోకలను పోలీసులు అనుమతించడం లేదు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అమలు పరచనున్నారు పోలీస్ అధికారులు. కాగా పాలేరు నుండి మహబూబాబాద్ కు ముఖ్యమంత్రి కేసీర్ విచ్చేయనున్నారు. రోజు మధ్యాహ్నం 3 గంటలకు మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య మంత్రి హాజరు కానున్నారు. అనంతరం 4 గంటలకు వర్ధన్నపేట లో నిర్వహిస్తున్న సభకు చేరుకోనున్నారు.