Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Sampoornesh Babu Venkatesh Maha Martin Luther King Movie Review And Rating In Telugu

Martin Luther King Review: మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ రివ్యూ

Published Date :October 27, 2023 , 8:35 am
By Bhargav Chaganti
Martin Luther King Review: మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ రివ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2.5 / 5

  • MAIN CAST: సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా
  • DIRECTOR: సంపూర్ణేష్ బాబు
  • MUSIC: స్మరణ్ సాయి
  • PRODUCER: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర

Martin Luther King Movie Review: సంపూర్ణేష్‌ బాబు, వీడు హీరో ఏంట్రా బాబు అనిపించేలా హృదయకాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తర్వాత పెద్ద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపిస్తూ అడపాదడపా అందరిని అలరిస్తూనే ఉన్నాడు. సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు లీడ్ రోల్ లో ఒక సినిమా చేశారు. తమిళంలో తెరకెక్కి రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన మండేలా అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌` అనే సినిమాలో ఆయన టైటిల్ రోల్ లో నటించారు. నూతన దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైనాట్‌ స్టూడియోస్‌, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో మహాయాన మోషన్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంపూర్ణేష్‌బాబుతో పాటు సీనియర్‌ నరేష్‌, వెంకటేష్‌ మహా, శరణ్య వంటి వారు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం(అక్టోబర్‌ 27)న విడుదల కాబోతోంది. సినిమా మీద నమ్మకంతో ఇప్పటికే పలు నగరాల్లో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.

మార్టిన్ లూథర్ కింగ్ కథ:
అది ఒంగోలు జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊరి పేరు పడమరపాడు. ఆ ఊరిలో రెండు వర్గాల ప్రజలు ఉంటారు. ఉత్తరం, దక్షిణం పేరుతో ఆ రెండు వర్గాల వారిని పిలుస్తూ ఉంటారు. ఆ రెండు వర్గాల మధ్య ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూనే ఉంటారు. ఆ రెండు వర్గాల వారిని కలపాలనే ఉద్దేశంతో ఆ ఊరి పెద్ద చాలా కాలం క్రితమే ఆ రెండు వర్గాల నుంచి ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుంటాడు. అయినా సరే సమస్య తీరదు సరి కదా వీరికి జన్మించిన జగజ్జీవన్ రామ్ అలియాస్ జగ్గు(నరేష్), లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ అలియాస్ లోకి (వెంకటేష్ మహా) రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ గొడవలకు దిగుతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఊరి పెద్దకు అనారోగ్యం రావడంతో అతని స్థానంలో ఎవరు ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలనే చర్చ వస్తుంది. ఈ క్రమంలోనే ఒకపక్క జగ్గు మరోపక్క లోకి పోటీలోకి దిగుతారు. ఊరి మొత్తం మీద అన్ని ఓట్లు సమంగానే ఉండగా చెప్పులు కుట్టుకుంటూ బతుకు జీవనం సాగిస్తూ ఉండే స్మైల్( సంపూర్ణేష్ బాబు) కొత్త ఓటు వారిద్దరికీ కొత్త ఊపిరి పోస్తుంది. అప్పుడే ఊరిలోకి వచ్చిన పోస్ట్ ఉమెన్ వసంత (శరణ్య ప్రదీప్) ఓటు విలువ తెలియజేసి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో కొత్త ఓటు పుట్టించి స్మైల్ కు ఇస్తుంది. ఆ ఒక్క ఓటు దక్కించుకునేందుకు స్మైల్ అడగకుండానే అతని ప్రలోభపెట్టేలా ఎన్నో వస్తువులు తెచ్చి పెడుతూ ఉంటారు జగ్గు, లోకి. వారి ప్రలోభాలకు మార్టిన్ లూథర్ కింగ్ తలోగ్గాడా? మార్టిన్ లూథర్ కింగ్ ఓటు కోసం పరితపించిన జగ్గు, లోకి ఎందుకు అతన్ని చంపాలి అనుకున్నారు? ఓటు పుట్టించి వసంత, మార్టిన్ లూథర్ కింగ్ కి మంచి చేసిందా చెడు చేసిందా? చివరికి తన ఓటుతో మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశాడు? ఆ ఓటు ఎవరికి వేసి ఎవరిని గెలిపించాడు అనేది ఈ సినిమా కథ.

Also Read

  • Honey Moon Express Review: హెబ్బా పటేల్ హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ
  • Attack Review: ఎటాక్ (హిందీ)
  • Mishan Impossible Review: మిషన్ ఇంపాజిబుల్
  • RRR Review : ఆర్ఆర్ఆర్

విశ్లేషణ:
రాజకీయ నాయకుల మీద వారి స్వార్థ బుద్దిని ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి, దాదాపుగా ఈ సినిమా కూడా అలాంటిదే. ఒకపక్క ఓటు విలువ తెలియ చెబుతూనే ప్రస్తుత రాజకీయాలకు చెంపపెట్టులా అనేక సెటైర్లు రాసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. వాస్తవానికి ఇది ఒరిజినల్ సినిమా కాదు, గతంలో తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా అనే సినిమాకి తెలుగు రీమేక్. అయితే తెలుగు వారికి కనెక్ట్ అయ్యే విధంగా తెలుగు రాజకీయాలను కనెక్ట్ చేస్తూ ఈ సినిమా రాసుకుంది పూజా కొల్లూరు. ఒక ఊరిలో ఉన్న రెండు వర్గాల ప్రజలు, మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టుకోవడం. అందుకోసం ప్రజాధనంతో కట్టిన ఆస్తులను సైతం ధ్వంసం చేయడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం లాంటి విషయాలను సూటిగా సుత్తి లేకుండా భయపడకుండా చూపించడంలో పూజ కొల్లూరు సఫలమైంది. స్త్రీలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినా సరే రాజకీయం కోసం పంతం కోసం మేమే నెగ్గాలనే ఒక అహంకార ధోరణి కోసం రాజకీయ నాయకులు వారి అనుచరులు ఎంత దూరం వెళతారు అనే విషయాన్ని కూడా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో పూజ సఫలం అయింది. ఎన్నికల్లో గెలిస్తే ఎవరికీ ఏం చేస్తావు అని అడిగితే లోకి అనే పాత్ర కుర్రాళ్లందరినీ గోవా తీసుకువెళ్తా, బార్ లో ఏసీ పెడతా అని అంటే జగ్గు అనే పాత్ర మాత్రం ఒక్కొక్కరి అకౌంట్లో 15,000 వేస్తానని చెప్పడం ప్రస్తుత రాజకీయ నాయకుల ఉచిత హామీలను ప్రతిబింబించేలా అనిపించింది. ఓటు రాజకీయం గురించి గతంలో అనేక సినిమాలు వచ్చాయి కానీ విలేజ్ లెవెల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి? జనాన్ని రాజకీయ నాయకుల స్వార్దం కోసం ఎలా బలి చేస్తున్నారు, ప్రజాధనంతో ప్రజలకు అందాల్సినవి అందకుండా చేస్తూ తమ వ్యాపారాలు చేసుకోవడం రియాలిటీకి దగ్గరగా ఉంది. సినిమా మొదటి నుంచి కామెడీ వేలో తెరకెక్కిస్తోన్నట్టు అనిపిస్తుంది. ఊరి జనం మధ్య గొడవలు, ఆ గొడవల కోసం ఎంత దూరం వెళ్ళే వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది టైరికల్‌గా చూపించారు. కింగ్‌ పాత్రతో అనేక ఎమోషన్స్ ను చూపిస్తూ ఆ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న తక్కువ కులం ఎక్కువ కులం సహా అనేక అంశాలపై ఆలోచింప చేసేలా పంచ్‌లు వేసిన తీరు బాగుంది. అయితే ఈ సినిమా `మండేలా` రీమేక్ కాబట్టి కచ్చితంగా ఆ సినిమాతో పాలక ఉంటుంది. మండేలా సినిమా ముందు నుంచి కామెడీతో నడిపించి చివర్లో ఎమోషనల్‌గా ముగించారు. కాబట్టి ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇక్కడ కింగ్ విషయానికి వస్తే మాత్రం అంతగా వర్కౌట్‌ కాలేదనిపించింది. ఎందుకంటే ఇక్కడ కామెడీ సీన్లు ఆశించిన స్థాయిలో పేలలేదు సరికదా కొన్నిచోట్ల అయితే బలవంతపు కామెడీలా మారిపోయింది. ఫస్టాఫ్‌ అంతా ఇలా ఊర్లో గొడవలు, కింగ్‌ పాత్ర తీరు చూపించగా అది కొంత వరకు కామిక్ వే వర్కౌట్ అయింది. సెకండాఫ్‌ మొత్తం సీరియస్‌ గా సాగినా కొంత వరకు ఎమోషనల్ గా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు. ఇక కొన్ని సీన్లు సాగదీత అనిపిస్తాయి. కింగ్‌ ఎమోషన్‌ అంతగా పండ లేదు. అలాగే కన్‌ క్లూజన్‌ ఇవ్వకుండా జనం అర్థం చేసుకుంటారు అని మనకే వదిలేసినట్టు అనిపిస్తుంది. కామెడీ, ఎమోషన్స్ పై పూర్తిగా దృష్టి పెడితే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

నటీనటుల విషయానికి వస్తే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పాత్రలో సంపూర్ణేష్‌బాబు సరిగ్గా నప్పాడు. అమాయకమైన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. గత చిత్రాల్లో ఆయన పాత్రలకు ఈ సినిమాలో పాత్రకు మంచి ట్రాన్స్ ఫర్మేషన్ కనిపించింది. యాక్టర్‌గా మరోమెట్టు ఎక్కాడు సంపూ. సర్పంచ్‌ అభ్యర్థులుగా వెంకటేష్‌ మహా, నరేష్‌ జీవించారు. పోస్ట్ ఉమెన్ గా శరణ్య ఆకట్టుకుంది. ఇక సంపూ వెంట ఉండే బుడ్డోడు కూడా చాలా బాగా నటించాడు. పెద్దాయన పాత్రలో రాఘవన్‌ తన పాత్ర పరిధి మేరకు నటించారు. పవన్ రమేష్ సహా ఇతర పాత్రల వారు కూడా పరిధి మేరకు, సహజంగా నటించారు. మొదటి సినిమా అయినా పూజ కొల్లూరు దర్శకురాలిగా ఎక్కడా తడబడకుండా తెరకెక్కించింది.కామెడీ, ఎమోషనల్‌ సీన్లపై మరింత వర్క్ చేస్తే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. స్మరణ్‌ సాయి సంగీతం సినిమాకి మంచి అసెట్. సినిమాలో పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకురాలే ఎడిటర్‌ కాగా అక్కడ కూడా కొంచెం వర్క్ చేసి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్‌గాః `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌` అక్కడక్కడా నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Martin Luther King Movie Review
  • Martin Luther King Review
  • Martin Luther King Telugu Review
  • Sampoornesh Babu Martin Luther King Review

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions