Telangana Elections 2023: రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు.. సాయుధ బలగాలతో పహారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 40 సెంట్రల్ కంపెనీ దళాలు మూడు పొరల భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంకు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుల్స్ ఉన్నాయి. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, పటాన్‌చెరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో 400లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, సేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ 28+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
Also Read
Read also: Election Counting: రేపే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ విధించారు. 6 నియోజకవర్గాల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సాయుధ బలగాలతో పహారా కాస్తున్నారు. సీసీ కెమెరా ల ద్వారా అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 1549 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 74.68 శాతం పోలింగ్ నమోదైంది. 6 సెగ్మెంట్లలో 77 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎమ్ లలో నిక్షిప్తం ఉంది. అర్బన్ లో అత్యధికంగా 21మంది పోటీలో ఉన్నారు. ఇంటి నుంచి ఓటు వేసిన వృద్దులు వికలాంగులు 2248, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 7215, అత్యవసర సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు 50 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 2352 బ్యాలెట్ యూనిట్లు,1957 కంట్రోల్ యూనిట్లు, 2186 వీవి ఫ్యాట్ లు ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఐదు చోట్ల జరుగుతుంది హన్మకొండ. వరంగల్ జిల్లాల సంబంధించి వరంగల్ ఈస్ట్ వర్ధన్నపేట నర్సంపేట.. వరంగల్ వెస్ట్ పరకాల సంబంధించిన ఐదు నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో చేపడుతున్నారు.. జనగామ జిల్లా పరిధిలోని పాలకుర్తి జనగామ స్టేషన్గన్పూర్ ఈ మూడు నియోజకవర్గాల కౌంటింగ్ ని జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో కౌంటింగ్ కి ఏర్పట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గంల కౌంటింగ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో జరగనుంది ఇక భూపాలపల్లి నియోజకవర్గం కౌంటింగ్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోని సింగరేణి మినీ హాల్లో చేపడుతున్నారు ములుగు నియోజకవర్గం కౌంటింగ్. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల పది నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు కొన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఐదు ని నియోజకవర్గాలకు ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలోని శ్రీ చైతన్య కిట్స్ ఇంజనీర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఐదు నియోజక వర్గాలకు సంబంధించి పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మొత్తం పది నియోజకవర్గాల్లో అత్యధికంగా ఖమ్మం , పాలేరు నియోజక వర్గంలో ఓటర్లు నమోదయి ఉన్నారు. ఖమ్మం పాలేరు సంబంధించి ఇరవైదు ,20, రౌండ్స్ ఉండగా మిగిలిన వాటిలో 14, 15, 16 ,రౌండ్స్ మాత్రమే ఉంటాయి. ఒక్క భద్రాచలం లో మాత్రం 12 రౌండ్స్ వుంటాయి. అయితే పాలేరు,ఖమ్మం నియోజక వర్గంలో అత్యధికంగా పోటీ చేసిన అభ్యర్థులు ఉండటంతో ఇక్కడ పలితం ఆలస్యంగా రావచ్చు .మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ కౌంటింగ్ కేంద్రాలను అందిస్తారు..
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మార్కెట్ యార్డులో నాలుగు నియోజకవర్గాలు పరిగి, వికారాబాద్, తాండూర్, కొడంగల్ కు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల దగ్గర కౌంటింగ్ చేయనున్న అధికారులతో సమావేశం అయ్యారు. ఏ రకంగా ఓట్లను కౌంట్ చేయాలనే విషయంపై అధికారులకు సూచిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో మొత్తం 14 టేబుల్లు , 22 రౌండ్లు ,రెండు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కాగా.. పరిగి నియోజకవర్గం లో మొదటగా దోమ మండలం కిష్టాపూర్ రౌండ్ తో ప్రారంభించి పూడూరు మండలం చిలాపూర్ గ్రామం ఆఖరి కౌంటింగ్ ఉంటుందని తెలియజేసిన అధికారులు.
Read also: Parliament Sessions: నేడు అఖిలపక్షం భేటీ.. పార్లమెంట్ లో పలు బిల్లుల ఆమోదానికి కసరత్తు..
మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ కానుంది. ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం. మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342 కాగా.. పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు కాగా.. మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు కొనసాగనుంది. మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ కాగా.. ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం ఉంది. మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం ఉందని సమాచారం. 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్ రాగా.. మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ రూంలు ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read also: Kurnool Medical College: సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు.. యూజీసీ కి ఫిర్యాదు
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు చేశారు. నాలుగు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న అధికారులు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పీవీటీజీ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కాగా.. మంచిర్యాల జిల్లా ముల్కల ఇంజనీరింగ్ కళశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు షురూ కానుంది. కౌంటింగ్ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్ విధించారు. ఉదయం 6 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధంచారు అధికారులు.
Kurnool Medical College: సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు.. యూజీసీ కి ఫిర్యాదు
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్‌లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!