El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- ఎల్ నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
- ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లు
- తాగునీరు, సాగునీటి పరిస్థితులపై సమీక్ష
- అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న ఎల్ నినో ప్రభావం, తాగు, సాగునీటి కొరత , ముంచుకొస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, తగిన అత్యవసర చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల బాధ్యతలు చేపట్టిన సీనియర్ అధికారులు
జిల్లాల వారీగా పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అనుభవజ్ఞులైన అధికారులకు అప్పగించింది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లాకు వికాస్ రాజ్, కరీంనగర్ జిల్లాకు బెనహర్ మహేష్ దత్తా ఎక్కా, మెదక్ జిల్లాకు ఎ. వాణి ప్రసాద్ ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు యోగితా రాణా, నల్గొండ జిల్లాకు హరిచందన దాసరి, ఆదిలాబాద్ జిల్లాకు ఇలాంబర్తి కె., వరంగల్ జిల్లాకు ఎ. శ్రీదేవిసేన, మహబూబ్‌నగర్ జిల్లాకు వి.పి. గౌతమ్, ఖమ్మం జిల్లాకు అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు.
Also Read
క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, కార్యాచరణ
నియమితులైన ప్రత్యేక ఐఏఎస్ అధికారులు తమకు కేటాయించిన ఉమ్మడి జిల్లాల్లో నిరంతరం పర్యటిస్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తాగునీటి ఎద్దడి, సాగునీటి లభ్యత, వర్షపాతం నమోదు స్థితిగతులను సమీక్షిస్తారు. వీటితో పాటు వ్యవసాయం, గృహ అవసరాలకు అందుతున్న విద్యుత్ సరఫరా తీరుపై క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తక్షణ ఉపశమన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు అందించేలా కార్యాచరణను సిద్ధం చేశారు.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!