Big Breaking: ఎంసెట్ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుకున్నట్టే జరిగింది.. చివరకు ఎంసెట్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. అయితే, ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ ఉంటుందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.. కానీ, ఆ తర్వాత కొంత సమయానికే ఎంసెట్‌ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది ఉన్నత విద్యామండలి.
Read Also: Hijab Row: హిజాబ్ అంశంపై వచ్చే వారం సుప్రీంలో విచారణ
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు అంచనా వేయడంతో.. ఈ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో వుంచుకొని సంబంధిత అధికారులతో సమీక్షించి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 14 మరియు 15వ తేదీల్లో జరగాల్సిన TS EAMCET (AM)-2022 (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షను మాత్రేమే వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది ఉన్నత విద్యామండలి.. మరియు ఈ పరీక్షను నిర్వహించే తదుపరి తేదీల వివరాలను త్వరలోనే తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.. అయితే, ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET- 2022 నిర్వహణ ముందుగా నోటిఫై చేయబడిన షెడ్యూల్ ప్రకారం, అనగా 18 జులై నుండి 20 జులై 2022 వరకు జరిగే పరీక్షలు, యథావిథిగా నిర్వహించబడుతాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్. లింబాద్రి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.

తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..