Telangana: వాహనదారులకు గమనిక… ఈ-ఛలాన్ సర్వర్ డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.100 జరిమానా పడితే..రూ.25 చెల్లిస్తే సరిపోతుందంటూ ఆఫర్ ఇవ్వడంతో తొలిరోజే పెద్ద ఎత్తున వాహనదారులు ఛలాన్లు కట్టేందుకు పోటెత్తారు. ఈ కారణంగా పెండింగ్‌లో ఉన్న ఛలాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియర్ అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వాహనదారులందరూ ఒక్కసారిగా వెబ్సైట్ మీదకు రావడంతో ఈ-ఛలాన్ సర్వర్ క్రాష్ అయ్యిందని అధికారులు చెప్తున్నారు.
సర్వర్ క్రాష్ కావడంతో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు అంతరాయం ఏర్పడింది. రోజుకు లక్ష నుంచి 3 లక్షల మంది వాహనదారులు తమ ఛలాన్లను క్లియర్ చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ చేస్తారని అధికారులు భావించారు. ఆ మేరకు ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడేలా సర్వర్ కూడా అప్ డేట్ చేశారు. అయితే తొలి రోజే 3 లక్షలకు పైగా వాహనదారులు ఒకేసారి వెబ్ సైట్‌ను ఆశ్రయించడంతో సైట్ డౌన్ అయిపోయింది. కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. ఆయా ఛలాన్లను డిస్కౌంట్‌తో చెల్లించేందుకు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు అధికారులు అవకాశమిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!