Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
- 235 మండలాల్లో కరువు పరిస్థితులపై చర్చ
- కేబినెట్ సబ్ కమిటీతో కార్యాచరణ
- రలో అఖిలపక్ష సమావేశం
- కేంద్ర సాయం కోసం ఢిల్లీకి బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం, దానివల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీరు, సాగునీటి ఎద్దడిపై మంత్రులు లోతుగా సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని రంగంలోకి దించాలని నిశ్చయించారు.
సలహాలు, సూచనల కోసం త్వరలోనే అఖిలపక్ష సమావేశం
రాష్ట్రంలో నెలకొన్న ఈ క్లిష్టమైన ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కరువు నివారణ ఉపశమన చర్యలపై అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని పార్టీల నాయకులు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
కేంద్రం నుంచి సహాయం కోసం ఢిల్లీకి పయనం
రాష్ట్రంలోని వర్షభావ మండలాలను అధికారికంగా కరువు మండలాలుగా ప్రకటించడంతో పాటు, బాధిత ప్రాంతాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులు, పంట నష్టం, కరువు తీవ్రతపై త్వరలోనే రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ సంబంధిత కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర పరిస్థితిని సమగ్ర నివేదిక రూపంలో అందించి, కేంద్రం నుంచి తక్షణ ఉపశమన నిధులు రాబట్టేందుకు విన్నవించాలని కేబినెట్ నిర్ణయించింది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!