Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో మరోసారి కలకలం మొదలైంది. బీహార్ అధికార పార్టీ జేడీయూలో పెద్ద మార్పు సంభవించింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. లాలన్ సింగ్ రాజీనామా తర్వాత జేడీయూ మళ్లీ నితీష్ కుమార్ చేతుల్లోకి వచ్చింది. అయితే నితీష్ అధ్యక్షుడిగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ మార్పు చాలా కీలకమని భావిస్తున్నారు. నిజానికి ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ జనతాదళ్ యూనైట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ చీఫ్ పదవికి నితీష్ కుమార్ పేరును జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. అంతకుముందు లాలన్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నితీష్ అధ్యక్షుడిగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటన వెలువడుతుంది.
Read Also:Madhuri Dixit : రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న మాధురి దీక్షిత్?
పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాల నడుమ ఈరోజు అంటే శుక్రవారం కూడా అదే కారులో నితీష్ కుమార్ తో సమావేశానికి చేరుకున్నారు. అంతకుముందు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ పార్టీ జాతీయ కార్యవర్గ, మండలి సమావేశానికి ఒక రోజు ముందు గురువారం పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్నారు. నితీష్ కుమార్ జేడీయూకి నాయకత్వం వహించడంతో లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు సులభతరంగా మారే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లలన్ సింగ్ దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2010 – 2013 మధ్య కాలంలో మినహా లాలన్ సింగ్ కూడా నితీష్ కుమార్‌కు కీలక సహాయకుడిగా ఉన్నారు. ఈ సమయంలో లాలన్ సింగ్ జెడి(యు)ని వీడారు.
Read Also:CM Jagan: పక్కవాడు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు..