Hyderabad Manhole: మ్యాన్ హోల్ ప్రమాదాలపై తెలంగాణ డీజీపీ సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Manhole: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో.. రుతుపవనాలు వేగంగా విస్తరించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాల నేపథ్యంలో వాహనదారులకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా కీలక సూచనలు చేశారు. వర్షం వస్తే మ్యాన్‌హోల్స్ తెరుచుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలంగాణ డీజీపీ ప్రయాణికులకు కోరారు.
Read also: Hyderabad Metro: పెరగనున్నమెట్రో ఛార్జీలు..! ఇందులో నిజమెంత?
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
డీజీపీ సూచనలు..
* సంబంధిత వాహన నిపుణులతో మీ వాహనం టైర్ల గ్రిప్/థ్రెడ్ స్థితిని తనిఖీ చేయండి. టైర్లు గ్రిప్పీగా లేకుంటే, వెంటనే వాటిని మార్చండి.
* మీ వాహనం టైర్లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
* వర్షం పడుతున్నప్పుడు పరిమిత వేగంతో నడపడం మంచిది.
* మీ వాహనం ఇంజిన్ పరిస్థితిని తనిఖీ చేయండి. బ్రేక్ ప్యాడ్‌లు మరియు విండ్‌స్క్రీన్ వైపర్‌ల పరిస్థితిని రెండుసార్లు తనిఖీ చేయండి.
* అవసరమైతే మీ వాహనాల్లో అత్యవసర కిట్‌లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి.
* అత్యవసర పరిస్థితుల్లో #Dial100కి కాల్ చేయడానికి మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్‌ని సెటప్ చేయండి.
* ఈ సూచనలు మీకు, మీ కుటుంబ భద్రతకు చాలా మంచివన్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Maoist Landmines: దడ పుట్టిస్తున్న మందు పాతరలు.. ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..