Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వార్తలో నిజమెంతనో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఫ్రీ బస్సులో ప్రయాణికులు రద్దీ నెలకొంటుంది. దీంతో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. ఎండాకాలంలో ఎండవేడిమి తట్టుకోలేక చాలామంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆశక్తి చూపారు. అయితే ఇప్పుడు వానాకాలం మొదలవుతుంది. ఇప్పుడు మళ్లీ ప్రయాణికులు బస్సుబాట పట్టనున్నారు. దీంతో మళ్ళీ మెట్రోకు ప్రయాణికులు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇదంగా దృష్టిలో వుంచుకుని మెట్రో చార్జీలు పెంచారా? అనే వాదనలు వినపిస్తున్నాయి. అయితే పెరిగిన ఈ మెట్రో చార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది ఇంకా క్లారిటీ రాలేదు.
Read also: Madhyapradesh : ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి తీవ్ర గాయాలు
మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో.. ఉన్నతాధికారుల సూచన మేరకు.. టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ అండ్ టీ సంస్థ సమాయత్తమవుతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో టికెట్ ధరలను పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఆ తర్వాత మెట్రో టికెట్ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మెట్రో ప్రారంభమైన ఛార్జీలే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. ఒక్కసారి మెట్రో చార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం లేదు. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఛార్జీలు ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో… ప్రస్తుతం మూడు లైన్ల ద్వారా రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గతంతో పోలిస్తే మెట్రో రద్దీ కాస్త తగ్గిందని చెప్పవచ్చు.
Read also: Telangana DGP: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. తెలంగాణ డీజీపీ పేరుతో ఫేక్ కాల్
ప్రతి నెలా రూ. 45 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 540 కోట్ల నష్టం వాటిల్లిందని ఎల్ అండ్ టీ తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో 2 కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర రూ.10. 2-4 కిలోమీటర్ల దూరానికి రూ.15 టికెట్ వసూలు చేస్తున్నారు. అలాగే 4-6 కి.మీ. దూరానికి రూ.25, 6-8 కి.మీ. దూరానికి రూ.30, 8-10 కి.మీ. దూరానికి రూ.35, 10-14 కి.మీ. దూరానికి రూ.40, 14-18 కి.మీ. దూరానికి రూ.45, 18-22 కి.మీ. దూరానికి రూ.50, 22-26 కి.మీ. దూరానికి రూ.55, 26 కి.మీ కంటే ఎక్కువ దూరానికి రూ.60 టిక్కెట్ ధర. అంటే ప్రస్తుతం ప్రారంభ టిక్కెట్ ధర రూ.10 కాగా.. గరిష్టంగా రూ. 60 ఉన్నాయి. టికెట్ రేట్లు 5-10 శాతం పెంచబడతాయి మరియు కనీస ధర రూ. గరిష్ఠ ధర రూ.20, రూ.80 వరకు పెంచే అవకాశం ఉన్నందున.. ప్రయాణికుల భారం పెరుగుతుందని తెలుస్తుంది.
Madhyapradesh : ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి తీవ్ర గాయాలు