NTV Telugu Site icon

తెలంగాణ క‌రోనా అప్‌డేట్.. మ‌రిన్ని త‌క్కువ కేసులు..

Covid 19

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 65,997 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,464 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 25 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇదే స‌మ‌యంలో 4.801 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 5,00,247కు మంది కోవిడ్ సోకి కోలుకున్నారు.. మ‌రోవైపు కోవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు 3085 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44,395 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. రిక‌వ‌రీ రేటు రాష్ట్రంలో 91.33 శాతంగా ఉంటే.. దేశంలో 87.2 శాతంగా ఉంద‌ని బులెటిన్‌లో పేర్కొన్నారు.. మ‌రోసారి జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్య‌ధికంగా 534 కొత్త కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, ఖ‌మ్మం జిల్లాలో రెండు వంద‌ల‌కు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.