తెలంగాణలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదు అని హెల్త్ డైరెక్టర్ ప్రకటించినా.. వరుసగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గత వారం రోజులుగా కరోనా కేసులు పైపైకి కదులుతున్నాయి.. గత మూడు రోజుల నుంచి ఐదు వందలకు చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,808 శాంపిల్స్ పరీక్షించగా.. 496 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో.. 205 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,613 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తన బులెటిన్‌లో పేర్కొంది వైద్యశాఖ.. కాగా, రాష్ట్రంలో వరుసగా పాజిటివ్ కేసులు పెరడంతో.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది వైద్యశాఖ.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.. రాష్ట్రంలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదంటూనే.. కొత్త వేరియంట్ వస్తేనే కేసులు పెరుగుతాయన్నారు డీహెచ్.. మరో 6 వారాలపాటు కరోనా కేసులు పెరగొచ్చని.. రోజుకు 3 వేల వరకు కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.. పండుగలు, ఫంక్షన్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు డీహెచ్.
Read Also: Andhra Pradesh: దర్శకుడు ఆర్జీవీపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్