NTV Telugu Site icon

Marri Shashidhar Reddy: వారు డబ్బులు తీసుకోవడం చూడలేదు …కానీ వ్యవహారం చూస్తే

Marri Shashidhar Reddy1

Marri Shashidhar Reddy1

Marri Shashidhar Reddy: కాంగ్రెస్‌కు ఆపార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి రాజీనామా చేశారు. 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్‌ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్‌ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది అన్నారు.ఉత్తమ్ పీసీసీ అయ్యాక అన్ని ఎన్నికల్లో ఒడిపోయామని సంచళన వ్యాక్యలు చేశారు. ఆరేళ్ళు ఆయన్ని ఎలా కొనసాగించారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ లో దురదృష్టకర పరిణామాలతోటే ఉత్తమ్ ఆరేళ్ళు పీసీసీ గా కొనసాగారని మండిపడ్డారు. ఇన్చార్జిలు అందర్నీ సమన్వయ పరచాలని కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఇన్చార్జీలు పీసీసీలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. పీసీసీలకు ఏజెంట్లుగా ఇన్చార్జిలు పనిచేశారని తెలిపారు.

Read also: MLAs Bribe Case: టార్గెట్ రామచంద్ర భారతి.. స్పీడ్ పెంచిన సిట్

బంగారు బాతుగా పీసీసీ లను భావిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఇంచార్జి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఇన్చార్జి మొదలుకుని.. వేణుగోపాల వరకు డబ్బు కీలకమైందని ఆరోపించారు. డబ్బులు తీసుకోవడం నేను చూడలేదు కానీ, వ్యవహారం చూస్తే అలాగే ఉందని సంచళన వ్యాఖ్యలు చేశారు. టైం ఆడిగితే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సోనియా గాంధీ కూడా నిస్సయకురాలు అయ్యారని తెలిపారు. ఉత్తమ్ భార్య ఓడిపోతే రాజీనామా చేశారని, ఉత్తమ్ చాలా మందికి నువ్వు పీసీసీ ట్రై చేసుకో అని చెప్పారని అన్నారు. అధిష్టనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి 17 మంది పేర్లు కుంతియా పంపారని ఆరోపించారు. అది ఉత్తమ్ ఎత్తుగడలో భాగమన్నారు. 2018 లో గెలిస్తే తన ఖాతాలో వేసుకోవచ్చు అని అనుకున్నారని ఆరోపణలు గుప్పించారు. చిదంబరం నాకు ఈ విషయం చెప్పారని అన్నారు.

Read also: Marri Shashidhar Reddy: బాధతో కాంగ్రెస్‌ తో బంధం తెంచుకుంటున్నాను

కేసీఆర్ క్యాబినెట్ లో రాజీనామా చేయకుండా తలసాని మంత్రి అయ్యారని ఆరోపించారు. అప్పుడు కనీసం ప్రొటెస్ట్ చేశారా? అంటూ ప్రశ్నించారు. 2020 లో పీసీసీ సెలక్షన్ ప్రాసెస్ చేశారు. ఎవర ని సంప్రదించకుండా రేవంత్ ని పీసీసీ చేశారని మండిపడ్డారు. ఠాగూర్ ఏం చెప్పినా వినే పరిస్థితి లేదని అన్నారు. రేవంత్ తో ఎదో ఉద్దరిస్తారని హైప్ చేసుకున్నారని ఆరోపించారు. Dcc లకు నెలకు రెండు లక్షల ఇస్తా అన్నారు అని అంతా రేవంత్ కి జై అన్నారని మండిపడ్డారు. రేవంత్ వ్యవహారం సరిగా లేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకపేట ల్యాండ్ విషయంలో ఎంతో హడావుడి చేశారని గుర్తుచేశారు. కోకపేట ల్యాండ్ విషయంలో కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. కానీ రేవంత్ సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 8న రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీకి వెళ్లారని, కోకపేట ల్యాండ్ పై సీబీఐ విచారణ చేయాలని సీబీఐకి లేక రాశాడని అన్నారు. ఆ తరవాత మళ్ళీ మాట్లాడలేదని ఆరోపించారు. రేవంత్ కి ఒకటి..రెండో విడత అందాయి అనుకున్నా.. ఆయన బ్లాక్ మైలర్ .. చీటర్ అంటూ మండిపడ్డారు. హుజురాబాద్ లో మూడు వేల ఓట్లు వస్తే ఎవరికి చీమ కుట్టినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.