NTV Telugu Site icon

Telangana Congress: అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా

Telangana Congress

Telangana Congress

Telangana Congress leaders fire BRS government: సింగరేణి ప్రైవేటీకరణకు అడుగు వేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని తెలంగాన కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు నిరుద్యోగ యువతకు నమ్మకం కలిగించాలని కోరారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే లీకేజ్ అవుతుందనే భయంలో ఉన్నారని అన్నారు. అలాంటి వాటికి తావు లేకుండా నమ్మకం కలగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

టీఎస్పీఎస్సీనే కాదు 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన రిక్రూట్మెంట్ల అన్నింటి పైన విచారణ జరిపించాలన్నారు. అప్పుడు బయటకు రాని అంశాలు ఇప్పుడు బయటకు వస్తాయని మండిపడ్డారు. రాష్ట్రపతికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాస్తామని తెలిపారు. న్యాయపోరాటం సైతం చేస్తామన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు అడుగు వేసింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ను ఔట్సోర్సింగ్ ఇచ్చి ప్రైవేట్ కి అప్పగించింది బీఆర్‌ఎస్‌ అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఆరోజు మద్దతు ఇచ్చి ఈరోజు ఎందుకు పోరాటం అని మండిపడ్డారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీపరం చేస్తే ఊరుకునేది లేదు పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

Read also: Mahaboobnagar Crime: ఆసుపత్రికి క్యూ కడుతున్న కల్తీ కల్లు భాదితులు.. ఇద్దరు మృతి

కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నిధులు నీళ్లు నియామకాలనే లక్ష్యాలతో రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఏ ఒక్కటి నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అన్నారు. ఆ బిల్లు తేవడంలో బీజేపీ, టీఆర్ఎస్ భాగస్వాములే అని ఆరోపించారు. హైప్, పబ్లిసిటీ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. బయ్యారం తెలంగాణ ప్రజల హక్కు అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాదు తెలంగాణలో మూతపడ్డ చెక్కర కర్మ గారాలను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇది వదిలేసి పరాయి పాలనలో బీఆర్ఎస్ పడుతుందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ కోసం తెచ్చిన బిల్లుకు నాటి ఎంపీలు బాల్క సుమన్, కవిత, వినోద్ కుమార్లు ఓటు వేయలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.

Read also: Harish Rao: మే 1న సీఎం నోట మరిన్ని శుభవార్తలు వింటారు.. ఉత్కంఠగా మంత్రి మాటలు

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యం ఖూనీ చేస్తున్న విధానాలను మంచిర్యాల సభ నుంచి ఎండగడుతామని అన్నారు. Tspsc లీకేజీ లో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపి, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. మోడీ, కేసీఆర్‌ ఇద్దరు దోపిడి దారులే అని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. నేడు మంచిర్యాలకు మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ హనుమంతరావు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను వీ హెచ్ పరిశీలించనున్నారు.
KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్‌.. కోల్డ్ స్టోరేజీ కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి

Show comments