Revanth Reddy: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలపై రేవంత్ స్పందించారు. వెంకన్న మావాడే అని తెలిపారు. మా మధ్య కొందరు అగాధం కల్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీని వీడిన రాజ్ గోపాల్ రెడ్డి వేరు.. పార్టీ కోసం పనిచేస్తున్న వెంకట్ రెడ్డి వేరుని రేవంత్ అన్నారు. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి, రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిందే అని తెలిపారు. వెంకట్ రెడ్డి కి వివరణ ఇస్తున్నానని, వెంకట్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ తెలిపారు. రాజ్ గోపాల్ రెడ్డి పై చేసిన వాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబందం లేదని స్పష్టం చేసారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 120 కేసులు పెట్టారని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి సవాళ్ళపై మునుగోడులో స్పందిస్తా అంటూ సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు. రాజ్ గోపాల్ రెడ్డి తో ఏ చర్చకు అయినా సిద్ధమే అన్న రేవంత్ రాజ్ గోపాల్ రెడ్డికి కులగురువు కేసీఆర్ అంటూ విమర్శించారు. వెంకన్న మా వాడే.. ఆయనపై కామెంట్స్ చెయ్యలేదని స్పష్టం చేసారు. మునుగోడు సభకు వెంకట్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. రావాలని కోరానని రేవంత్ అన్నారు.
read also: Social Media Fake Posts: టీడీపీపై తప్పుడు ప్రచారం..! విజయసాయిరెడ్డిపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు..
మునుగోడు అభ్యర్థులపై ఇంకా చర్చ జరగలేదని రేవంత్ స్పష్టం చేసారు. బీజేపీ కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. భద్రాచలం ముంపుకు కారణం మోడీ, ఆయన మంత్రివర్గం అని విమర్శించారు. తెలంగాణా కు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం తిరస్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ కు బీజేపీ ద్రోహం చేసిందని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల పేరుతో ప్రలోభాలు పెడుతున్నారని మండిపడ్డారు. చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తికి కారణమని ఆనందం వ్యక్తం చేసారు.
బీజేపీ, టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ మునుగోడు సభలో చెరుకు సుధాకర్ పాల్గొంటారని స్పష్టం చేసారు. కాంగ్రెస్ తీసుకునే చర్యలను తెలంగాణ ప్రజలు ఆహ్వానించాలని కోరారు రేవంత్. ఇక చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ఏర్పాడ్డాక పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశానని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను బలపరిచామని పేర్కొన్నారు. తెలంగాణ ఇంటి పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమం కారుల కోసం త్వరలో పీసీసీ కమిటీ ఉంటుందని తెలిపారు.
Rahul Gandhi: ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు