NTV Telugu Site icon

Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా.. 14 సీట్లు గెలుస్తున్నాం

Revanth Reddy Ap

Revanth Reddy Ap

Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా అని, 14 సీట్లు గెలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కారు షెడ్డుకు పోయింది.. డ్రైవర్ కి కాలు విరిగిందన్నారు. బీఎస్పీ సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ సమాధానం చెప్పుకోవాలన్నారు. 100 రోజుల సంబరాలు ప్రజలు చేసుకుంటారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీతో కలిస్తే తిడతామన్నారు. ఎంఐఎం విధానం మా పట్ల మారిందా.. లేదా అనేది ఆ పార్టీ చెప్పాలన్నారు. హరీష్.. పార్టీలో గందర గోళం ఉందని తెలిపారు. నిన్న కవిత ఇంటికి వెళ్లిన హరీష్ వెనకాల నిలబడ్డారన్నారు. ఇప్పుడు ఇది.. రేపు ఏంటి అని గందరగోళం లో హరీష్ ఉన్నాడని అన్నారు. బీజేపీ.. బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వం పడగోడతం అంటున్నారని తెలిపారు. నాతో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారని తెలిపారు. మేము నిర్ణయం తీసుకుంటే ఐదో మనిషి బీఆర్ఎస్ వాళ్లకు మిగలరన్నారు. అతి తెలివి పనులు మానేయాలన్నారు.

Read also: Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్‌ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!

ప్రభుత్వం పడగొట్టే పని వాళ్ళు చేస్తే.. నిలబెట్టే పనిలో నేను ఉంటా? అన్నారు. దేనికైనా సిద్ధమన్నారు. నా పని నన్ను చేయనిస్తే మంచిది.. పడగొట్టాలని మీరు అనుకుంటే.. మీరు నిద్రలో ఉంటే.. నీ పక్కన ఎవడు ఉండడు.. మీ ఒంటి మీద బట్టలు తప్పా అన్నారు. కేసీఆర్ ఆనాడు సీఎం గా ఎన్ని మాటలు అన్నాడు.. నల్గొండ సభలో సీఎంగా నన్ను ఏమన్నాడో తెలుసు కదా..! ఇంకా కేసీఆర్ కి అహంకారం అనగలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఏం మాట్లాడిండో… సోషల్ మీడియాలో ప్రజలు పెడుతున్నారని, వాటిని చూసుకో మని చెప్పండి కేసీఆర్ కి అన్నారు. మోడీ ఇన్ఫ్లుయెన్స్ లో అరెస్ట్.. రాజకీయ లబ్ది పొందేందుకు బీఆర్ఎస్.. బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అద్యక్షుడు దళితుడు.. బంగారు లక్ష్మణ్ కూతురిని అవమాన పరిచింది బీజేపీ అని గుర్తు చేశారు. బంగారు లక్ష్మణ్ కుటుంభంని వీధికి వదిలేశారన్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు అని ఆ పార్టీ పదవి నుండి తీసేసిందన్నారు. ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి మోడీ అన్నారని గుర్తు చేశారు.
PM Modi: కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే.. బీఆర్ఎస్ నీళ్ళ స్కాం