Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kriti Kharbanda and Pulkit Samrat’s Marriage Pics Goes Viral: హీరోయిన్ కృతి కర్బందా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, హీరో పులకిత్ సామ్రాట్‌తో ఆమె ఏడడుగులు వేశారు. శుక్రవారం (మార్చి 15) హర్యానాలోని గురుగ్రామ్‌లో కృతి, పులకిత్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. అయితే ఒకరోజు ఆలస్యంగా నూతన జంట తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
‘ప్రతి సమయంలో నా గుండె కొట్టుకునేది నీ కోసమే. ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి’ అని కృతి కర్బందా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. పెళ్లిలో కృతి పాస్టెల్ పింక్ లెహంగాను ధరించగా.. పులకిత్ సామ్రాట్ పాస్టెల్ గ్రీన్ షేర్వాణీ ధరించాడు. ఫోటోల్లో కృతి, పులకిత్‌లు ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడిచి వస్తుంటే చుట్టూ ఉన్నవారు పూల వర్షం కురిపించారు. ఇంకో ఫోటోలో కృతి తన భర్తకు ముద్దు పెట్టింది. వీరిద్దరూ వీరే కి వెడ్డింగ్, తైష్, పాగల్పంటి చిత్రాలలో జంటగా కనిపించారు. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అనుమతితో ఒక్కటయ్యారు.
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
Also Read: Vivo T3 5G Launch: మార్చి 21న వివో టీ3 5జీ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్‌ల డీటెయిల్స్ ఇవే!
తెలుగులో ‘బోణి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కృతి కర్బందా.. ‘తీన్‌మార్’, ‘ఒంగోలుగిత్తా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిస్టర్ నూకయ్య, ఓం సినిమాలో నటించారు. 2015లో వచ్చిన ‘బ్రూస్ లీ’ తర్వాత కృతి తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్‌లో ఆమె బిజీగా మారారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసినా.. బాలీవుడ్‌లోనే కృతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. పాగల్పంటి (2019) షూటింగ్ సమయంలోనే పులకిత్ సామ్రాట్‌తో ప్రేమలో పడ్డారు. కృతికి ఇదే మొదటి వివాహం కాగా.. పులకిత్‌కి రెండో పెళ్లి. నటి శ్వేతా రోహిరాని 2014లో పెళ్లి చేసుకున్న పులకిత్.. వివాహమైన 11 నెలలకే ఆమెతో విడిపోయాడు.
తాజావార్తలు
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!