Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎల్బీ నగర్ వేదికగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలోకి గేట్ నంబర్ 8 నుంచి ముఖ్యమంత్రి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. స్టేడియం సామర్థ్యంతో 80 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నాయకులు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు రేవంత్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ కూటమితోపాటు సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలనా పరిస్థితి, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.
Read also: Trafic Retrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎల్‌బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు..
తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని తయారు చేశారు. ముప్పై వేల మంది సామాన్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేడియం వెలుపల వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా రేవంత్‌ప్రమాణానికి 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డికి గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, కళాకారులు స్వాగత ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా తెలంగాణ క్యాబినెట్ లో నేడు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ,శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు ,సీతక్క ,కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మరో 10 మంది మంత్రులు ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని అంటున్నారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగమైన ఆరు హామీల పథకానికి చట్టబద్ధత కల్పించే పత్రాలపై రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు.
Bhabhi 2: జోయా నచ్చితే ఈ సినిమాలపై ఒక లుక్కెయ్యండి… ఇంకా నచ్చుతుంది