Rinku Singh: యూపీ టీ20 లీగ్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే కొద్ది నయా రికార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ లీగ్‌లో మనం ఓ హీరో గురించి మాట్లాడుకోవాలి.. ఆయనే రింకు సింగ్. యూపీ టీ20 లీగ్‌లో రింకు సింగ్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాజాగా ఆగస్టు 31న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఇదే మ్యాచ్‌లో నయా సంచలనం స్వస్తిక్ చికారా సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
READ ALSO: Haryana: ఆమెక్ బెయిల్ వస్తుందా..డిసైడ్ చేయనున్న కోర్ట్
201 పరుగుల లక్ష్యం… సిక్సర్ల వర్షం..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నోయిడా కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వీళ్ల ఇన్నింగ్స్‌లో మొత్తం 10 సిక్సర్లు నమోదు అయ్యాయి. రింకు సింగ్ జట్టు మీరట్ మావెరిక్స్ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. వీళ్ల జట్టు ఓపెనర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా శుభారంభాన్ని అందించారు. స్వస్తిక్ చికారా – రితురాజ్ శర్మ జోడి మొదటి 10 ఓవర్లలో 96 పరుగులు చేశారు. ఇందులో స్వస్తిక్ చికారావే 64 పరుగులు ఉండటం విశేషం. అతను 38 బంతుల్లో 168.42 స్ట్రైక్ రేట్‌తో 7 సిక్సర్లతో బాది 64 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన రింకు సింగ్ మ్యాచ్‌కు అంతే బలమైన ముగింపు ఇచ్చాడు. రింకు సింగ్ తన ఇన్నింగ్స్‌లో కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొని 308.33 స్ట్రైక్ రేట్‌తో 37 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు.
ఇరు జట్లు కొట్టిన మొత్తం సిక్సర్ల..
స్వస్తిక్‌తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన రితురాజ్ శర్మ 44 బంతుల్లో 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. రింకుతో పాటు మాధవ్ కౌశిక్ 19 బంతుల్లో 4 సిక్సర్లతో అజేయంగా 38 పరుగులు చేశాడు. దీంతో మీరట్ మావెరిక్స్ 17 సిక్సర్లతో 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి మొత్తం 27 సిక్సర్లు బాదాయి.
READ ALSO: Varun Chaudhary: ఎన్ఎస్‌యూఐలో కుదుపు.. జాతీయ అధ్యక్షుడు అవుట్.. DUSU ఎన్నికల వేళ కీలక పరిణామం..