CM Revanth Reddy: ఎలాంటి సమయంలోనైనా సహకారాం అందించేందుకు సిద్దంగా ఉన్నామను హామీ ఇస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HICCలో ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ తదితర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. ఈ కార్యక్రమానికి తెలంగాన సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కరోనా ఎన్నో ఇబ్బందులను సృష్టించిందని తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉత్పత్తి అయిన కరోనా టీకాలు ప్రపంచ వ్యాప్తంగా సరాఫరా అయ్యాయన్నారు. ఫార్మా రంగానికి చెందిన ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యామని అన్నారు. ఎలాంటి సమయంలోనైనా సహకారాం అందించేందుకు సిద్దంగా ఉన్నామను హామీ ఇస్తున్నామని రేవంత్ అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పడుతున్న ఫార్మా రంగ ప్రతినీధులకు అభినందనలు తెలిపారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రపంచ వేదికగా ఉందన్నారు.
ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫార్మావిలేజ్ లకు రూపకల్పన చేశామన్నారు.
Read also: India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు.. ఇది మంచి పద్దతి కాదు..
21వ బయో ఆసియా సదస్సులో 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాల విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోమెడికల్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్యరంగంలో ఆవిష్కరణలు, వైద్య పరికరాలకు ప్రోత్సాహకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమస్యలపై పరిశోధనలు చేస్తున్న విత్తన కంపెనీలకు ప్రోత్సాహకాలు, మద్దతుపై అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా నోబెల్ గ్రహీత, ప్రముఖ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేయనున్నారు. 28న పలు చర్చాగోష్టులతో ముగింపు సమావేశం ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించడానికి 700 కంటే ఎక్కువ వినూత్న స్టార్టప్‌లు పోటీ పడగా, నిపుణులు షోకేస్ కోసం 70 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురిని షార్ట్‌లిస్ట్ చేసి కాన్ఫరెన్స్ చివరి రోజున ప్రత్యేక అవార్డులను అందజేస్తారు.
TS Entermediate Exam: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు