Site icon NTV Telugu

కేంద్రంపై మ‌రో పోరాటం.. నేడు కేసీఆర్ వ్యూహ ర‌చ‌న‌..!

కేంద్రంపై మ‌రోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను వేదిక‌గా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ‌ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయ‌నున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బ‌డ్జెట్ తొలి విడత స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో.. బ‌డ్జెట్ స‌మావేశాల్లో లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు కాబోతోంది..

Read Also: వాహ‌నాల‌కు రిఫ్లెక్టివ్‌ టేప్ త‌ప్ప‌నిస‌రి.. లేదా రూ.10వేలు ఫైన్..!

రాష్ట్రంలో అమ‌లు కావాల్సిన పెండింగ్ అంశాలు, కేంద్రం నిధులు స‌హా.. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయ‌నున్నారు సీఎం కేసీఆర్.. తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను ఎంపీల‌కు సూచించ‌నున్నారు. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో.. వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్రాన్ని నిల‌దీసింది టీఆర్ఎస్‌.. ఇప్పుటు మిగ‌తా అంశాల‌పై ఫోక‌స్ పెట్టేందుకు సిద్ధం అవుతోంది.. అస‌లే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మ‌ధ్య కాస్త గ్యాప్ పెరిగిన నేప‌థ్యంలోఇవాళ జ‌ర‌గ‌నున్న భేటీలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Exit mobile version