కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ…