కేంద్ర జలశక్తి మంత్రితో కేసీఆర్ భేటీ.. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తిన పర్యటనలోఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం అయ్యారు… ఇవాళ సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే, నెల రోజుల వ్యవధిలోనే షెకావత్‌తో కేసీఆర్ భేటీ కావడం ఇది రెండోసారి.. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైన కేసీఆర్.. 5 అంశాలపై విజ్ఞానపత్రం అందజేశారు.. ఇక, ఇవాళ్టి సమావేశంలోనూ గత సమావేశంలో చర్చించిన అంశాలే మరలా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది..
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఏర్పడక ముందే ప్రారంభించిన 11 ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిటి నోటిఫికేషన్ లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీల నీటి పరిధిలోనే ప్రొజెక్టులు ఉన్నాయని, అందులో 758.76 టీఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. మరో 148.82 టీఎంసీల సంబంధించి నీటి లభ్యతపై హైడ్రోలజీ డైరెక్టరేట్ అనుమతులు మంజూరు చేసిందని లేఖలో పేర్కొన్న సీఎం.. చిన్న నీటి పారుదల పథకమైన కందుకుర్తి ఎత్తిపోతల పథకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందని..దీనికి అనుమతులు అవసరం లేదన్నారు. రామప్ప పాకాల లింక్, తుపాకులగూడెం బ్యారేజ్, దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగం కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదని.. కంతనపల్లి ప్రాజెక్టును కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్.
Also Read
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!