Women’s Day 2022: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. మానవ జాతికి మహిళ ఒక వరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కె.చంద్రశేఖర్ రావు.. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని పేర్కొన్న ఆయన.. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని, త్యాగపూరితమైందన్నారు.. అన్నీతానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే ఒక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని, దార్శనికతను మానవీయ కోణాన్ని.. తన పాలనలో అన్వయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు.. మానవ జాతికి మహిళ ఒక వరం అని తెలిపిన ఆయన.. మహిళాభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని అన్నారు.
Read Also: AP: ఎమ్మెల్యేకు మాయిస్టుల హెచ్చరిక.. రాజీనామా చేసి మన్యం వీడండి..!
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
దళిత, బడుగు బలహీన వెనకబడిన వర్గాలు, రైతుల ఆత్మబంధువుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు సీఎం కేసీఆర్.. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా బంధుగా ఆదరణ పొందుతుండడం తనకెతంతో సంతోషం కలిగిస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా తనవంతుగా ఆర్థికంగా ఆదుకుంటూ., 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించి ఆర్థింకంగా ఆదుకుంటూ ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, వంటి పథకాలతో పాటు, వితంతువులు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలా నెలా సకాలంలో పెన్షన్లు అందచేస్తూ, షీ టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తూ.. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు జీతాల పెంచడంతో పాటు ఇంకా అనేక పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, ‘మహిళా బంధు’ గా మహిళాలోకం చేత ఆదరణ పొందుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళాభ్యుద కార్యాచరణ, మహిళకు ఆర్థిక సామాజిక సమానత్వంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో సమానత్వం దిశగా మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిందన్నారు కేసీఆర్… మహిళకు సామాజిక ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను కట్టబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించిందన్నారు. తద్వారా మహిళను తెలంగాణ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించుకుంటున్నదని తన ప్రకటనలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
- Tags
తాజావార్తలు
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
-
Singapore Open 2026: సింగపూర్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
-
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..