Site icon NTV Telugu

TRS: కేంద్రంపై ఒత్తిడి.. ఢిల్లీలో.. గల్లీలోనూ పోరు..

కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్‌, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్‌ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్‌ ఎంపీల బృందం.. ఇప్పటికే గోయల్‌ను కలిసిన టీఆర్ఎస్‌ ఎంపీ కేకే.. న‌లుగురు మంత్రులు ఢిల్లీ వ‌చ్చార‌ని గోయ‌ల్‌కు వివ‌రించారు. మంత్రుల‌కు, ఎంపీల‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని గోయ‌ల్‌ను కేశ‌వ‌రావు కోరారు. రేపు షెడ్యూల్ చూసుకుని స‌మ‌యం ఇచ్చేందుకు ప‌రిశీలిస్తాన‌ని పీయూష్ గోయ‌ల్ కేకేకు తెలిపారు… ఈ తర్వాత ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.. అయితే, వన్‌ నేష‌న్‌–‌వన్‌ ప్రొక్యూ‌ర్‌‌మెంట్‌ నినా‌దంతో, పంజా‌బ్‌లో మాది‌రిగా తెలం‌గా‌ణ‌లోనూ మొత్తం ధాన్యం కొను‌గోలు చేయా‌లనే డిమాం‌డ్‌తో రాష్ట్ర మంత్రుల బృందం హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే.. సీఎం కేసీఆర్‌ ఆదే‌శాల మేరకు ఢిల్లీ వెళ్లిన‌ ఈ బృందంలో నిరం‌జ‌న్‌‌రెడ్డి, గంగుల కమ‌లా‌కర్‌, వేముల ప్రశాం‌త్‌‌రెడ్డి, పువ్వాడ అజ‌య్‌‌కు‌మార్‌ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయ‌ల్‌తో పాటు పలు‌వురు కేంద్ర మంత్రు‌లను కలవనున్నారు.. మొత్తంగా.. ఢిల్లీతో పాటు గల్లీలోనూ బీజేపీపై పోరు చేస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ.

Exit mobile version