వచ్చే ఎన్నికల లోపు 5 లక్షల మందికి దళిత బంధు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికలలోపు 5 లక్షల మందికి దళిత బంధు అందిస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును హుజురాబాద్‌లో సంపూర్ణంగా అమలై తీరుతుందని క్లారిటీ ఇచ్చారు.. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశామని మరోసారి గుర్తుచేసిన కేసీఆర్.. పథకంపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నాం అన్నారు.. ఇక, దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అన్నారు.
ఇక, హుజురాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న మిగతా 4 మండలాల్లో కూడా అమలు చేస్తాం అన్నారు.. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు అమలు చేస్తాం.. ఈ ప్రక్రియ మార్చి లోపు అమలవుతుందన్నారు కేసీఆర్.. వచ్చే ఏడాది దళిత బంధు కోసం 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని వెల్లడించిన తెలంగాణ సీఎం.. వచ్చే మార్చిలోపు 20 లక్షల కుటుంబాలకు అమలు చేస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్ది అన్ని కుటుంబాలకు వర్తింపజేస్తూ వస్తాం.. నాలుగైదు సంవత్సరాల్లో అందరికీ దళిత బంధు అందేలా చూస్తాం అన్నారు సీఎం కేసీఆర్.
Also Read
- Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
- Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?