వచ్చే ఎన్నికలలోపు 5 లక్షల మందికి దళిత బంధు అందిస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును హుజురాబాద్‌లో సంపూర్ణంగా అమలై తీరుతుందని క్లారిటీ ఇచ్చారు.. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశామని మరోసారి గుర్తుచేసిన కేసీఆర్.. పథకంపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నాం అన్నారు.. ఇక, దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అన్నారు.
ఇక, హుజురాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న మిగతా 4 మండలాల్లో కూడా అమలు చేస్తాం అన్నారు.. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు అమలు చేస్తాం.. ఈ ప్రక్రియ మార్చి లోపు అమలవుతుందన్నారు కేసీఆర్.. వచ్చే ఏడాది దళిత బంధు కోసం 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని వెల్లడించిన తెలంగాణ సీఎం.. వచ్చే మార్చిలోపు 20 లక్షల కుటుంబాలకు అమలు చేస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్ది అన్ని కుటుంబాలకు వర్తింపజేస్తూ వస్తాం.. నాలుగైదు సంవత్సరాల్లో అందరికీ దళిత బంధు అందేలా చూస్తాం అన్నారు సీఎం కేసీఆర్.