NTV Telugu Site icon

Niti Ayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం.. కారణం ఏమిటంటే..?

Cm Revanth Reddy Pm Modi

Cm Revanth Reddy Pm Modi

Niti Ayog Meeting: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చించింది. ఈ చర్చల్లో పాల్గొన్న పలు పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం’ అనే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతివ్వగా, బీజేపీ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read also: Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..

రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ (ఈ నెల 27న) ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిష్కరించగా, ఆయన పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానితో ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండేవారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను విమర్శించిందని, తాజా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు.
Kamala Harris: డెమోక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఫిక్స్..!