తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూను అమలు చేయాలనే అలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై నేడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో నైట్ కర్ఫ్యూ అమలుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. థియేటర్లు, మాల్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. నైట్ కర్ఫ్యూ ను రాత్రి 9 గంటల నుంచి తెల్లరారి 6 గంటల వరకు విధించే అవకాశాలను పరిశీలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో వైద్యసౌకర్యాలు, అందుబాటులో కోవిడ్ బెడ్స్, ఆక్సీజన్ సరఫరా తదితర అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Read: కాంగ్రెస్ బాటలో బీజేపీ.. పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలి