TG Cabinet : 34 ప్రశ్నలతో ఇంటింటి గణన – 89 వేల మంది సిబ్బంది

  • మంత్రివర్గ భేటీలో జన గణనపై కీలక నిర్ణయం
  • మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల నమోదు
  • 34 ప్రశ్నలతో కూడిన సమగ్ర సర్వే పత్రం
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది జన గణన
Telangana Cabinet

Telangana Cabinet

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census 2027) ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కేబినెట్‌కు వివరిస్తూ, మే 11వ తేదీన ఈ గణనను ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Healthy Laddu Recipe: రోజుకో హెల్తీ లడ్డు చాలు.. శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఇట్టే లభిస్తాయి!

ఈ హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించిన 34 ప్రశ్నలతో కూడిన నమూనా పత్రాన్ని ప్రభుత్వం వినియోగించనుంది. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించేందుకు సుమారు 84 వేల మంది ఎన్యుమరేటర్లను, వారికి దిశానిర్దేశం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను కలిపి మొత్తం 89 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధుల్లో భాగస్వాములను చేయనున్నారు. తొలి దశ విజయవంతంగా ముగిసిన తర్వాత, అసలైన రెండో దశ జన గణన ప్రక్రియను వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంచనాకు ఈ గణన ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Last Words Before D*eath: ప్రాణాలు విడిచే ముందు ప్రజలు చెప్పే చివరి మాటలు ఇవే..!