Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్, పాలు అందించే నిర్ణయం
- గోదావరి పుష్కరాల కోసం రూ.1000 కోట్ల కేటాయింపుకు ఆమోదం
- కొత్త పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి భారీ గుడ్ న్యూస్ చెప్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (Government Junior Colleges) కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid-day Meal Scheme) అమలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు స్కూళ్లతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం), పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆధ్యాత్మిక రంగానికి పెద్దపీట వేస్తూ.. రాబోయే 2027 గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనుల కోసం ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా, అందులో మొదటి విడత కింద రూ.300 కోట్లు తక్షణమే మంజూరు చేస్తూ పచ్చజెండా ఊపింది.
మరోవైపు నిరుద్యోగ యువతకు , ఉద్యోగార్థులకు కూడా తెలంగాణ కేబినెట్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్-టీచింగ్ పోస్టులతో పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిన మరో 3 పోస్టుల నియామకాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వీటితో పాటు మహబూబాబాద్ జిల్లా కే.సముద్రం (K.Samudram) ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం) నిర్వహణ కోసం మరో 18 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ అటు స్టూడెంట్స్‌కి, ఇటు నిరుద్యోగులకు , భక్తులకు ఎంతో మేలు చేకూర్చేలా సాగింది.
Also Read
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!