Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
- విద్యుత్ కేసులు సీబీఐకి అప్పగింపు
- భూముల ధరల సవరణకు గ్రీన్ సిగ్నల్
- మున్సిపల్ బకాయిలపై OTS అమలు
- రైతులకు అకాల వర్షాల సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణ, మున్సిపల్ పన్నుల బకాయిలపై వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS), రైతులకు అకాల వర్షాల సహాయం ఇంకా ఐటీఐలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వంటి కీలక అంశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
1.విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14వ తేదీన కమిషన్స్ ఆఫ్ ఇన్క్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జులైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించారు.
Also Read
- Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభించనున్న సీఎం.!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
2024 అక్టోబర్లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. వాటన్నింటినీ ఈ రోజు కేబినేట్ చర్చించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
2. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయి.
వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది.
3. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
4. నిన్న అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
5. నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ( NARMAC) కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది.
6. తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
7. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ( OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
8. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.
9. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
10. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.
తాజావార్తలు
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్‌సభ స్పీకర్‌తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
-
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా హిస్టరీ
-
Mega Charan : మెగాస్టార్ – చరణ్.. ఆ రెండు ఫేక్.. ఫ్యాన్స్ హ్యాపీ
-
Bollywood : సమంత భర్తతో సల్మాన్ ఖాన్..? సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్‌ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!