Site icon NTV Telugu

Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..

Bjp

Bjp

Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కమలం పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ అధిష్టానం.. జిల్లాల వారిగా పార్టీ అధ్యక్షుల ఎంపికపై ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఇప్పటికే, పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది.

Read Also: Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ మొదలైంది!

ఇక, 19 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన బీజేపీ..
1. జనగామ- చౌడ రమేష్
2. వరంగల్- గంట రవి
3. హన్మకొండ- సంతోష్ రెడ్డి
4. జయశంకర్ భూపాల పల్లి- నిశిధర్ రెడ్డి
5. నల్గొండ- నాగం వర్షిత్ రెడ్డి
6. నిజామాబాద్- దినేష్ కులాచారి
7. వనపర్తి- నారాయణ
8. హైదారాబాద్ సెంట్రల్- దీపక్ రెడ్డి
9. మేడ్చల్ రూరల్- శ్రీనివాస్
10. కొమురం భీమ్ ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్
11. కామారెడ్డి- నీలం చిన్న రాజులు
12. ములుగు- బలరాం
13. మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి
14. జగిత్యాల- యాదగిరి బాబు
15. మంచిర్యాల- వెంకటేశ్వర్లు గౌడ్
16. పెద్దపల్లి- సంజీవరెడ్డి
17 ఆదిలాబాద్- బ్రహ్మానందరెడ్డి
18. మెదక్- రాధా మల్లెష్ గౌడ్
19. సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్

Exit mobile version