Site icon NTV Telugu

BC Reservations : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక వాదనలు

Bc Reservations

Bc Reservations

BC Reservations : బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో జరుగుతున్న విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు చేసిన వాదనలు కీలకంగా నిలిచాయి. పిటిషనర్‌ న్యాయవాదులు వాదిస్తూ.. రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. “ట్రిపుల్ టెస్ట్” ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు.

KantaraChapter1 Collections : రికార్డ్స్ కొల్లగొడుతున్న కాంతార చాఫ్టర్ 1.. 6 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ట్రిపుల్ టెస్ట్‌లో ప్రధాన అంశాలు:

పిటిషనర్‌ న్యాయవాది మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పరీక్షలలో ఏదీ పాటించలేదు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్‌ బయట పెట్టలేదు, ఎంపిరికల్‌ డేటా కూడా పూర్తిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం” అని వాదించారు. 2018లో అప్పటి ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మరో పిటిషనర్‌ లాయర్‌ మయూర్‌ రెడ్డి ప్రస్తావించారు. “ఆ తీర్పులో కూడా ఇదే అంశం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం తిరిగి అదే తప్పును చేస్తోంది” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..  “గవర్నర్‌ వద్దకు బిల్‌ వెళ్లిన తర్వాత నెల రోజుల్లో చర్య తీసుకోవాలి. ఒకవేళ ఆలస్యం అయితే మూడు నెలల్లో  కేబినెట్‌కు పంపి, అక్కడినుంచి తిరిగి గవర్నర్‌ ఆమోదించాలి. కానీ ఈ బిల్‌ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఆ ప్రక్రియ పూర్తికాకముందే GO 9 జారీ చేశారు” అని చెప్పారు. హైకోర్టు ఈ వాదనలు విన్న అనంతరం విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది.

Pakistan Terror Attack: పాకిస్తాన్ సైన్యంపై TTP దాడి.. ఇద్దరు అధికారులతో సహా 11 మంది మృతి..

Exit mobile version