Site icon NTV Telugu

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ పునఃప్రారంభం.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?

Assembly

Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ( జనవరి 2న) పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు జరిగిన స్పల్పకాలిక చర్చలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇక, ఇవాళ్టి సమావేశంలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు. MNREGA పథకంలో మార్పులకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించుకోవడం ద్వారా రాష్ట్రాలపై పెను భారం మోపడానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కార్ ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.

Read Also: ACs, Refrigerators: బీఈఈ కొత్త నిబంధనలు.. 10 శాతం పెరగనున్న ACలు, రిఫ్రిజిరేటర్ల ధరలు

అలాగే, ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లోకి మున్సిపల్ శాఖ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అంశంపై ప్రధానంగా చర్చతో పాటు తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు కూడా అసెంబ్లీ ముందుకు రానుంది. ఇక, మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లుపై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నుంచి జరిగే సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లను ప్రకటించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ ఎంపిక చేసింది.

Exit mobile version