Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ మూడో అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 11.30కు సభ ప్రారంభంకానుంది. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడనుంది. రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. గ్యారెంటీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదానిపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని సమాచారం. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్నిరోజులు నడపాలనేదానిపై నిర్ణయంపై క్లారిటీ ఇవ్వనున్నారు.
Read also: Annapoorani OTT Release Date: నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎక్కడంటే?
తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసిందే. స్పీకర్ పదవికి మరెవరూ నామినేట్ కాకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు గడ్డం ప్రసాద్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్పీకర్ స్థానంలో గడ్డం ప్రసాద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన కుర్చీ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేటీఆర్, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉంటే ప్రమాణస్వీకారం చేయబోమని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తాము చెప్పినట్లు ప్రమాణం చేయలేదు. కొత్త స్పీకర్ ఎన్నిక అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన శాసనసభ కొనసాతుంది.
Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్ గ్రీన్