Congress-CPM: కాంగ్రెస్ పార్టీ తో పొత్తు.. నేటితో ముగియనున్న సీపీఎం డెడ్ లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress-CPM: సీట్ల సర్ధుబాటుపై గురువారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్ తో పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో వామపక్షాలు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. సీట్ల కేటాయింపుపై మధ్యాహ్నం 3 గంటలలోగా స్పష్టత ఇవ్వాలని వామపక్షాలు కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ విధించాయి. లేనిపక్షంలో సీపీఎం పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమకు ఫోన్ చేసి పొత్తులపై క్లారిటీ ఇస్తానని చెప్పారని తమ్మినేని తెలిపారు. నవంబర్ 1న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో భట్టి చెప్పారని తమ్మినేని తెలిపారు. నవంబర్ 1న జరిగిన సీపీఎం కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తు అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. వైరా, మిర్యాలగూడ సీట్లు కేటాయిస్తే పొత్తుకు అంగీకరించాలని సీపీఎం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని సీపీఎం నేతలు చెబుతున్నారు. సీపీఐ అభ్యర్థులు పోటీ చేసే చోట సీపీఎం పోటీ చేయదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచిచూడాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తుల పరిస్థితి పై రాష్ట్ర కమిటీ లో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. మరోసారి డైడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరు పై తమ్మినేని స్పందించారు. ఎవరి పంచన చేరే అలవాటు వామపక్షాలకు లేదనీ… రాజకీయ ఎత్తుగడలో భాగాంగానే పొత్తులు ఉంటాయని తెలిపారు. ఏ జాబితాను చూసి భయపడం.. మా జాబితాలు మాకుంటాయంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ , సీపీఎం అడిగిన సీట్లు ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. ఒంటరి పోటీ పై నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ నేతల సూచనతో మధ్యాహ్నం వరకు అగి, సీపీఎం నిర్ణయం వెల్లడించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 22 స్థానాలకు సంబంధించిన లిస్ట్ ను సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రిపేర్ చేసింది. కాంగ్రెస్ తో పొత్తు చెడితే 3 గంటలకు లిస్ట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇక సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు కోసం వేచి ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇవ్వాళ ఉమ్మడి వామపక్ష పార్టీల సమావేశం ఉండే అవకాశం వున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకుండా సీపీఎం, సీపీఐ కలిసే ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read
Also read: Arvind Kejriwal : డీటీసీ బస్సు, గూఢచర్యం కుంభకోణం, మద్యం పాలసీ.. నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్
మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు అంశంపై సీపీఐ నారాయణ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలో తేల్చుకోకుండా పొత్తులపై విమర్శలు చేస్తూ… నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా? అని జరుగుతున్న రాజకీయాలను విమర్శించారు. తమతో పొత్తు, సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు చెన్నూరు కాంగ్రెస్ సీటు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా చెన్నూరు సీటును సీపీఐ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. సీపీఐ నారాయణ చేసిన ఈ ట్వీట్ కలకలం రేపుతోంది. అనే విషయంపై ఇవాళ మధ్యాహ్నం స్పష్టత వస్తుందని సమాచారం.
నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc
— Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023
Telangana Elections 2023: నేడు బీజేపీ మూడో జాబితా.. జనసేనకు 8-10 సీట్లు?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!