Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..

  • ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు
  • మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • పండుగల కారణంగా మధ్యలో సభకు సెలవులు
  • ఆదివారం కూడా సభ నిర్వహించే యోచన
Budget

Budget

Telangana Assembly Bugdet Sessions : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలు , కొత్త బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!

సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్ , శ్రీరామనవమి వంటి ప్రధాన పండుగలు వస్తుండటంతో ఆయా రోజుల్లో సభకు సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల కారణంగా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు, ప్రభుత్వం ఈ నెల 29వ తేదీ ఆదివారం నాడు కూడా సభను నిర్వహించాలని యోచిస్తోంది. ప్రభుత్వ అజెండాతో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతుండగా, సభను అర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద మార్చి 30 వరకు జరగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!