Rain Alert : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాలతో రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
Thammudu : ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్.. నితిన్ ఈ సారైన హిట్ దక్కేనా..!
తెలంగాణలో 19 జిల్లాలు వర్ష ప్రభావానికి లోనవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తారంగా వీసే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో, వర్షభారానికి గురయ్యే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు సూచనలు పాటించాలని వాతావరణ శాఖ తెలిపింది. అధికార యంత్రాంగం కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచనలిచ్చింది.
Crime News Today: జగ్గయ్యపేటలో దారుణం.. కొడుకుని కడతేర్చిన తండ్రి!
