Rain Alert : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాలతో రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు…