El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
- ఎల్‌నినో, వర్షపాతం లోటుపై చర్చ
- భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
- తాగునీరు, సాగునీటి సరఫరాపై ప్రధానంగా చర్చ
- కరువు నివారణకు పార్టీల సూచనలు స్వీకరించనున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు , తీవ్రమవుతున్న కరువు పరిస్థితులపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించేందుకు బుధవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో (6వ అంతస్తు, గది నంబర్ 33) ఈ సమావేశం జరగనుంది.
ప్రధానంగా చర్చకు రానున్న కీలక అంశాలు
రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల అన్నదాతలు, సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించే దిశగా ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించడం, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, అలాగే వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించనున్నారు.
Also Read
- Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
- Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
- Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
అఖిలపక్ష నేతల సలహాలు, సూచనలతో సమగ్ర వ్యూహం
కరువు నివారణకు అనుసరించాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలపై వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి విలువైన సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది. రాష్ట్రంలో తలెత్తిన ఈ కరువు పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ అఖిలపక్ష భేటీ దిశనిర్దేశం చేయనుంది.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
-
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
-
InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 550 మందికి ఉద్వాసన?
-
Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
-
Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!