BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BIG Breaking: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాల కోసం ntvtelugu.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. కాగా.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పది పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 10వ తరగతి పరీక్షలకు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పది పరీక్షలకు 4,86,194 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది పరీక్షలు రాశారు. 1,809 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ప్రైవేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు. రెండింటిలోనూ బాలికలు రాణించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వారిలో 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 63.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్‌లో, 68,335 మంది బీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు.
Also Read
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ఇక, బాలికలు 68 శాతం ఉత్తీర్ణులైతే, బాలురు 56.82 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇదిలావుంటే.. ద్వితీయ సంవత్సరంలో.. మొత్తం 3,80,920 మంది హాజరుకాగా 2,56,241 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఏ గ్రేడ్ లో లక్షా 73 వేలు, బీ గ్రేడ్ లో 54,786 మంది ఉత్తీర్ణత సాధించగా… 73.46 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 60.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. కానీ వృత్తి విద్యా కోర్సుల విషయానికి వస్తే మొదటి సంవత్సరంలో మొత్తం 2,55,533 మంది, ద్వితీయ సంవత్సరంలో 28,738 మంది ఉత్తీర్ణులయ్యారు.
Errabelli Dayakar: విధుల్లోకి రండి మంత్రి విజ్ఞప్తి.. తగ్గేదే లే అంటున్న జూ.పంచాయతీ కార్యదర్శులు
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!