Teegala Krishna Reddy: మంత్రి సబితకు మరో తలనొప్పి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన సొంత నియోజకవర్గం మహేశ్వరంలో తలనొప్పులు తప్పడం లేదు.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బడంగ్పేట్లో సబితా ఇంద్రారెడ్డి.. టీఆర్ఎస్లో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. మున్సిపల్ ఎన్నికల్లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.. కానీ, తాజాగా, టీఆర్ఎస్ నుంచి మేయర్ చిగురింత పారిజాతా నరసింహారెడ్డి తిరిగి సొంతగూడైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత పార్టీ కండువా కప్పుకోవడంతో మంత్రి సబితకు షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోవైపు, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు మంత్రి సబితను టార్గెట్ చేయడంతో కొత్త తలనొప్పి మొదలైనట్టు అయ్యింది.
మంత్రి సబితపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మీర్పేట్ మున్సిపాలిటీని సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు తీగల.. అంతేకాదు, తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.. ఇక, మంత్రి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపించిన ఆయన.. చెరువులు, స్కూళ్ల స్థలాలను కూడా వదలడం లేదని విమర్శించారు.. టీఆర్ఎస్ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని.. ఇదే సమయంలో అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడనున్నట్టు వెల్లడించారు..
Also Read
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- Off The Record : బడే భాయ్ తో యుద్ధానికి తెలంగాణ సీఎం సిద్ధం..?
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి తీగల కృష్ణారెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామలతో.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆమెను మంత్రి పదవి కూడా వరించింది.. అయితే, టీఆర్ఎస్లో మంత్రి సబిత కంటే సీనియర్‌గా ఉన్న తీగల కృష్ణారెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది.. ఈ రెండు వర్గాల మధ్య ఆదినుంచి ఆధిపత్య పోరు సాగుతున్నా.. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో బహిర్గతం అయ్యాయి. వరుస పరిణామాలు తన సొంత నియోజకవర్గంలో మంత్రి సబితకు తలనొప్పిగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజావార్తలు
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!