Site icon NTV Telugu

Tarun Chugh: త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ 2.. 119 స్థానాల్లో బీజేపీ పోటీ

Tarun Chug

Tarun Chug

Tarun Chugh: తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ -2 మొదలవుతుందని తెలిపారు. మార్చు 31 వరకు ఈ సమావేశాలు సభలు నిర్వహిస్తామన్నారు. ప్రధానమంత్రి బహిరంగ సభ త్వరలో నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి పై బీజేపీ పై నమ్మకం ఉందని, ప్రధానమంత్రి నేతృత్వంలో తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి పాలన, కుటుంబ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి గల్లి స్థాయి నుంచి ఢిల్లీ పంజాబ్ స్థాయి వరకు వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రజల సమస్యలపై కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని విమర్శించేందుకు పెట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ డిప్రెషన్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని ఎద్దేవ చేశారు.

Read also: MLC: తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

బీఆర్‌ఎస్‌ పార్టీ కలలుగనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందని వ్యంగాస్ర్తం వేశారు. కుటుంబ పాలన ,అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బీటీం కాంగ్రెస్ పార్టీ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నారు. 119 స్థానంలో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయిందని ఎద్దేవ చేశారు. ఎవరైనా గెలుస్తామని చెప్తారు కానీ కాంగ్రెస్ ఒడిపోతామని చెపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని తెలిసికూడా యాత్రలో ఎందుకు? అంటూ ప్రశ్నించారు. 119 స్తానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఎన్నికలకు ముందు సపరేటుగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అన్నారు. మోడీ నిజాయితీపరులు కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఇంకా ఈటెల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారని తెలిపారు.
C.V.Anand: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠా.. ముంబైలో మకాం వేసి..

Exit mobile version