TS BJP: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS BJP: లోక్ సభ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ‘టార్గెట్ కాంగ్రెస్’ వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీఆర్ఎస్పై కాకుండా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ తదితరుల వరకు అందరూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ నేడు రాష్ట్రానికి రానున్నారు.
ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం సునీల్ బన్సల్ తెలంగాణాలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు కీలకంగా మారిన లోక్ సభ ఎన్నికలు.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు సీట్లు తగ్గించి, అదే సమయంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నాయి. విమర్శల దాడి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోంది. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
Also Read
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసేదేమీ లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ పాలన, అక్రమాలు వస్తాయని ఆరోపించారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తామని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెట్టింపు చేశారు. ఈసారి రెండంకెల ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లైనా గెలవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీని ఆదేశించింది. దీంతో పాటు మరో రెండు సీట్లు గెలుచుకునేందుకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.
Himanta Biswa Sarma : ఆయనే అరెస్ట్ ను ఆహ్వానించారు.. కేజ్రీవాల్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!