Tarun Chug : వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు పడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. ఇవాళ ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు .. ప్రపంచంలోనే ఇండియాను 3వ స్థానానికి తీసుకెళ్లడానికి నిరంతర కృషి చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తుందని, దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశంలో రాబోయేది.. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం పోయినా .కాంగ్రెస్ రూపేనా మరో అవినీతి ప్రభుత్వము వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సర్కార్ జాతీయ కాంగ్రెస్ కి ఫండింగ్ చేస్తోందని, రాహుల్ యాత్ర కోసం రేవంత్ రెడ్డి విలువైన బస్సును ఏర్పాటు చేశారన్నారు. దేశంలో అధికారంలోకి రాని కాంగ్రెస్, బి ఆర్ఎస్ ల కు ఓటు వేయడం దండగ అని ఆయన వ్యాఖ్యానించారు.
Chiranjeevi: అవార్డు వచ్చినందుకు నాకు ఆనందంగా లేదు.. చిరు షాకింగ్ కామెంట్స్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
అభివృద్ధి, సంక్షేమంను సమతూకం తో బడ్జెట్ ప్రవేశపెట్టారని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి లక్ పతి పథకం ప్రవేశ పెట్టి 3కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ కేటాయించిందన్నారు. గత పదేళ్లుగా మహిళల అక్షరాస్యత శాతం 25 పెరిగిందని, బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది .. అది కాంగ్రెస్ గెలుపు కాదని, గ్యారెంటీ లు అమలు చేయకుండా దాట వేస్తోందన్నారు. ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతి అని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి నేడు నోరు మెదపడం లేదని, సీబీఐ విచారణ అని గతం లో చెప్పిన రేవంత్ రెడ్డి మిన్నకుండి పోవడం దేనికి సంకేతమన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణా లో పదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలను గెలుస్తామన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!