NTV Telugu Site icon

Tammineni: ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా… గోల్కొండ కోట కింద బొంద పెడతాం

Tammineni Verabhadram

Tammineni Verabhadram

Tammineni: ఈ గడ్డ మీద కాషాయ జెండాను ఎరుగానివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం,గోల్కొండ కోట కింద బొంద పెడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం మళ్ళీ ఎర్ర జెండా వైపు చూస్తున్న క్రమంలో మనం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు సీట్లు లేకుండా పోతున్నాయి భవిష్యత్ ఉందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టుల భవిష్యత్ ఉందా అనేది కాదు, కమ్యూనిస్టులు లేకపోతే మీకు భవిష్యత్ ఉందా అనేది ఆలోచించండి? అని ప్రశ్నించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రతిపాదించిన చరిత్ర కాంగ్రెస్ ది కాదు, కమ్యూనిస్టులదే అన్నారు. సమస్త సంపదకు మూలం అయిన అన్నింటినీ కార్పొరేట్ పరం చేస్తున్నారని తెలిపారు. ఒకే దేశం ఒకే టాక్స్ అని చెప్పే మోడీ ఎందుకు ఒకే కులం అని చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాతుర్వర్ణ వ్యవస్థ మళ్ళీ రావాలని కోరుకునే వారు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు అని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ మూలపురుషులు రాసిన గ్రంధాల్లో ఈ దేశం వర్ణ, కుల సంక్రమణం జరిగిందని తెలిపారు.

Read also: Kottu Satyanarayana:పవన్ ముందు నువ్వు ప్రతిపక్షనేతగా గెలిచి చూపించు

ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తి చేసుకోవాలి అని చెప్పడమే బీజేపీ సిద్దాంతమన్నారు. బీసీ ప్రధాని అంటున్నారు కానీ బీసీ లకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో అన్ని పార్టీలు కుల, గణన జరగాలి అని చెబుతున్న బీజేపీ ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర కరణ కాదు, వికేంద్రీకరణ జరగాలి అని ప్రతిపాదించింది కమ్యునిస్టు పార్టీలని అన్నారు. కేసిఆర్ తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు కదా అంటే.. అవును మేము ఇచ్చిన హామీల మీద ఉద్యమిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌, అందరూ ప్రాంతీయ పార్టీలు అందుకు కలసి వస్తున్నారు అంటే వారి అవసరాల కోసం, రాష్ట్రాల హక్కుల కోసమని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఉద్యమించడంలో విస్మరించే శక్తులు కమ్యునిస్టులని అన్నారు. బీజేపీ నీ ఎప్పుడు వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ తెలంగాణ లో 50 సీట్లు ఇస్తాం అంటే వెళ్తమా? కాలి గోటితో సమానం మీ సీట్లన్నారు. నిన్న ప్రధాని వచ్చి అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి పరులు అందరూ ఏకం అవుతున్నారు అని చెబుతున్నారు. ఈ గడ్డ మీద కాషాయ జెండాను ఎరుగానివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం,గోల్కొండ కోట కింద బొంద పెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harshavardhan Reddy: జూపల్లి ని ఓడించిన బుద్ధి రాలేదు.. విచారణకు నేను రె’ఢీ’